రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది. ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది. పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత
91
previous post