నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న – రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టింది&period; ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు&period; ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు&period; సంకెళ్లు తెంచి స్వేచ్ఛ ను పంచి జనం ఆకాంక్షలను నిజంచేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు&period; తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ&comma; అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతి ఇచ్చిందని పేర్కొన్నారు&period; పేదల గొంతుకు వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందన్నారు&period; పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని&comma; పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు&period; రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..