గులాబీ జెండా ఎగరడం ఖాయం…

Kavitha

Advertisements

&NewLine;<p>సింగరేణి సంస్థ పురోగమనానికి TBGKS గెలుపు చాలా అవసరమని&comma; సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు&comma; ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు&period; సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో సంఘ నాయకులు&comma; ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్ లో కవిత తో సమావేశమయ్యారు&period; కార్మికుల హక్కులు&comma; ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమన్నారు&period; సింగరేణి అంటే సింహ గర్జన అని&comma; అదే స్పూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు&period; తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని&comma; సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు కూడా లేదన్నారు&period; గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం&comma; చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని&comma; కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు&period; అధికారం ఉన్నా&comma; లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని&comma; ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని కవిత తేల్చిచెప్పారు&period; ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లా పనిచేయాలని సూచించారు&period; అతిత్వరలో తమ సంఘ మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని కవిత ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..