ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్న పోలీసులు..

attempt murder

Advertisements

&NewLine;<p>కడప జిల్లా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీ పై అక్టోబర్ 28 à°µ తేదీనా జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను మూడవ పట్టణ ఇన్స్పెక్టర్&comma; సిబ్బంది అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డిఎస్పి నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు&period; బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించినట్లు&comma; పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సుయాత్ర లో అదును చూసుకుని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ రోడ్డుపై బెనర్జీని ముద్దాయిలైన రామ్మోహన్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డిలు అతని బైకును ఢీ కొట్టి&comma; అందుబాటులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పాటు హత్యా ప్రయత్నం చేసి&period;&period; అనంతరం బైకుపై పరారయ్యారని వెల్లడించారు&period; శనివారం ఉదయం వీరి అరెస్టును ధ్రువీకరించిన డిఎస్పి&comma; భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు&comma; రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు&period; ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు నిందితులు సెల్ఫోన్లు సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు&period; రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి అనే వ్యక్తి అలాగే మరికొందరు ముద్దాయిలకు సహకరించి వారికి వాహనాలు&comma; ఆర్థిక సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని&comma; త్వరలో వారిని కూడా విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు&period; ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బందిని డిఎస్పీ నాగరాజు అభినందించారు&period; అలాగే ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..