ముదినేపల్లి మండలం పేరూరు శివారు తెరగూడెం గ్రామంలో నివసించే వీరబత్తిన కన్నయ్య (61 సం”వయస్సు ) ఆనారోగ్యంతో కొంతకాలంగా బాధపతున్న రీత్యా స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే ఆర్థిక స్తోమత లేక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు… గురువారం మధ్యాహ్నం 3 గంట|| సమయంలో డాక్టర్ పర్యవేక్షణలో చూసి వైద్యం అందించారు, అనంతరం రాత్రి 8.30 సమయంలో ఆరోగ్యం కాస్త కుదురుగా ఉంది అనే సమాచారం ఇచ్చి డిశ్చార్జ్ చేశారు…కుటుంబ సభ్యులు పేషెంట్ పరిస్థితి బాలేదు అని అభ్యంతరం చేసిన, వైద్యులు కనీస బాధ్యత లేకుండా అక్కడ నుంచి పంపించేశారు . అనంతరం రాత్రి 9.30 సమయంలో వీరబత్తిన కన్నయ్య చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు… వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అని కుమారుడు వీరబత్తిన చిట్టి నిరసన వ్యక్తం చేశారు .
వైద్యుల నిర్లక్ష్యమే కారణం….
74
previous post