పెద్దవడుగూరు మండల పొలాలకు నీళ్లు ఇవ్వాలని మిర్చి రైతులతో కలిసి మిడుతూరు వద్ద బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారిని తాడిపత్రి టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి గారు, జెసి ప్రభాకర్ రెడ్డి గారు దిగ్భంధించారు. ఈ సందర్భంగా జెసి అష్మిత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మిర్చి రైతులకు నీళ్లు ఇవ్వకపోతే వాళ్లకు ఆత్మహత్యే శరణమని ఆయన అన్నారు. అధికారులు మేల్కొని కాలువకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఇసుక దోపిడీ చేయడం కోసం నీళ్లు వదులుతారు కానీ పంటలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే మాత్రం వదలరు అని బాధపడ్డారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదని ఇసుక దోపిడీ కోసం 7 టీఎంసీల నీళ్లు వృధా చేసిన దౌర్భాగ్యుడు తాడిపత్రి ఎమ్మెల్యే అని ఆయన మండిపడ్డారు. పెద్ద వడుగూరు మండల పత్తి రైతుల్ని కాపాడలేకపోయారని కనీసం మిర్చి రైతుల పొలాలకు అయినా నీళ్లు వదిలి వీళ్ళను కాపాడండి అని ఆయన అన్నారు. పెద్దవడుగూరు రైతులతో పాలాభిషేకాలు చేయించుకున్న తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు మిర్చి రైతులను నట్టేట ముంచాడని ఎద్దేవా చేసారు. ఇప్పటికైనా నీళ్లు ఇచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని పత్తి, మిర్చి రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, ఇవ్వని పక్షములో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు. రాబోవు కాలంలో కూడా రైతుకు అండగా నిలబడతామని రైతుల సాక్షిగా జెసి అష్మిత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.
నీళ్లు వృధా చేసిన దౌర్భాగ్యుడు….
56
previous post