బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

Bay of Bengal

Advertisements

&NewLine;<p>పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది&period; ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ నేడు తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు&period; ఒకవేళ ఇది తుఫాన్‌గా మారితే &OpenCurlyQuote;మిధిలి’గా నామకరణం చేయనున్నారు&period; ఈ నెల 18à°¨ తెల్లవారుజామున బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు&period; ఈ ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు&period; మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని&comma; ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు&period; త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది&period; దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు&period; రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి&period; ఉత్తర కోస్తా&comma; యానాంలో శుక్ర&comma; శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు&period; దక్షిణ కోస్తాలో ఇవాళ&comma; రేపు భారీ వర్షాలు పడతాయంటున్నారు&period; రాయలసీమలో ఇవాళ&comma; రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్