తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదు – వికాస్ రాజ్

Vikas Raj

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70&period;74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్&period; హైదరాబాదులో అత్యల్పంగా 46&period;68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు&period; మునుగోడులో అత్యధికంగా 91&period;05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు&period; అయితే&comma; గతంలో కంటే ఈసారి పోలింగ్ 3 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు&period; 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73&period;37 అని వివరించారు&period; రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ తెలిపారు&period; ఇక&comma; ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని&comma; దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు&period; రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు&period; రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని&comma; ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు&period; ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు&period; పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1&period;80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు&period; సీ విజిల్ యాప్ ద్వారా 10&comma;132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.