దొంగల బీభత్సం..పట్టపగలే ఇంట్లో చోరీ

Advertisements

&NewLine;<p>పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు చోరీ చేశారు&period; ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది&period; పట్టణ పరిధిలోని స్థానిక చైతన్య హైస్కూల్ వీధి సమీపంలో సింగారెడ్డి అమర్నాథ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు&period; ఇవాళ ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగలు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు&period; నాగసుబ్బమ్మను కొట్టి&comma; ఇంట్లో ఉన్న బాత్రూంలో ఆమెను పడేసి&comma; ఆమె మెడలోని గొలుసు&comma; గాజులు దొంగలు లాక్కుపోయినట్లు బాధితుడు పేర్కొన్నారు&period; దాదాపు 14 తులాలు బంగారు చోరీ అయినట్లు బాధితుడు తెలిపారు&period;ఈ ఘటనపై వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అమరనాథ్ రెడ్డి తెలిపారు&period; విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు&period; పట్టపగలే చోరీ జరగడంతో చుట్టుపక్కల గృహయజమానులు భయాందోళనకు గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.