పరీక్షలు ముగిసాయి. మరికొద్ది గంటలో తమ తమ ఊర్లకి చేరాల్సి ఉన్న విద్యార్థులు అప్పటిదాకా మనసులో కక్ష్యనంతా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసి తీర్చుకున్నారు. అది కూడా మామూలుగా కాదు, సినిమాలు చూసిన ప్రభావంతో ఈ దాడులు చేసుకోవడంతో పాఠశాల విద్యార్థులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డ తండా సమీపంలో బాలానగర్ కు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థుల పై దాడికి దిగారు. ఇటీవల పలుమార్లు విద్యార్థుల మధ్య గొడవలు చెలరేగడంతో కక్ష్య పెంచుకున్న ఇంటర్ విద్యార్థులు సమయం చూసి ఇంటర్ పరీక్షలు ముగిసే సమయంలో తమను అడిగే వారే లేరంటూ పదవ తరగతి విద్యార్థులపై దాడికి దిగారు. దీంతో సుమారు 9 మంది పదవ తరగతి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంత జరిగినా పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ మరుసటి రోజు దాకా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో గాయపడ్డ విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కింది. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు. కానీ పాఠశాల ప్రిన్సిపాల్ అవేవీ జరగలేదు అన్నట్టు వ్యవహరించడంతో విద్యార్థి సంఘాల నుండి విమర్శలు ఎదురయ్యాయి. విద్యార్థులు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలు రికార్డు కావడంతో అవి బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థి సంఘాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకొని ఘటనకు గల కారణాలు తెలుసుకొని విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారని పోలీసులు తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాత్రం తమ పాఠశాలలో ఎలాంటి ఘటనలు జరగలేదని విద్యార్థులకు మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారని తెల్పడం గమనార్హం.
సినిమాల ప్రభావం విద్యార్థులపై ఉందనడానికి నిదర్శనం ఇదే…
122
previous post