చంద్రబాబు కనిగిరి మహాసభను జయప్రదం చేయండి అని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్వగృహం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి పట్టణంలో ఈనెల ఐదున మాజీ ముఖ్యమంత్రివర్యులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మహాసభను మార్కాపురం నియోజకవర్గం లో ఉన్నటువంటి టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సభను జయప్రదం చేయడానికి మన నియోజకవర్గానికి ఇన్చార్జిలుగా 6 మందిని వేయడం జరిగిందని అన్నారు. ఈ సభకు మన మార్కాపురం నియోజకవర్గం నుండి సుమారు 25 వేల మంది వెళ్లే దానికి ఎవరి శాయశక్తులా వారు కృషి చేయాలని తెలిపారు. అలాగే వచ్చే వంద రోజుల్లో ఎన్నికలు జరగనుండగా మన బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐదున కనిగిరిలో జరిగే మహాసభను విజయవంతం చేసేందుకు ఎవరికి వారు కృషిచేసి జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు, వక్కలు గడ్డ మల్లికార్జున, కాకర్ల శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయరెడ్డి, రాష్ట్ర టిడిపి నాయకులు మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.
మన బలం చూపించాల్సిన టైం వచ్చింది….
111