తమిళనాట ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాలు.

తమిళనాట ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాలు

Advertisements

<p>అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజుకో ట్విస్ట్‌తో తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది&period; నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ&comma; అధికార పీఠం దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు&period; ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లేని కారణంగా విజయ్‌ను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ అధికారికంగా ప్రకటించింది&period; రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్&comma; విజయ్ మధ్య జరిగిన రెండో విడత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది&period; ఈ సమావేశం అనంతరం రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది&period; ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ వద్ద లేదని&period;&period; కేవలం అతిపెద్ద పార్టీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేమని&comma; రాజ్యాంగ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఎన్నికల ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ TVK 108 స్థానాలు సాధించింది&period; కాంగ్రెస్ తన 5 సీట్ల మద్దతును ప్రకటించడంతో ఈ సంఖ్య 113 కి చేరింది&period; విజయ్ రెండు చోట్ల గెలిచినందున&comma; ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది&period; అప్పుడు TVK బలం 107 కి తగ్గుతుంది&period; కాంగ్రెస్‌తో కలిపి కూటమి బలం 112 వద్దే ఆగిపోతుంది&period; అధికారం దక్కించుకోవడానికి విజయ్‌కు ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం&period; ఈ అదనపు మద్దతు లేఖలు లేకపోవడంతోనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;<p>గవర్నర్ నిర్ణయంపై టీవీకే మద్దతుదారులతో పాటు వీసీకే&comma; సీపీఐ వంటి పార్టీలు మండిపడుతున్నాయి&period; అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ను ముందుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి&period; మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీ వేదికగా అవకాశం ఇవ్వాలి తప్ప&comma; రాజ్ భవన్‌లో సంతకాలు అడగడం రాజ్యాంగ విరుద్ధం అని వారు వాదిస్తున్నారు&period; కేంద్రం జోక్యంతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>దాదాపు 60 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గట్టి దెబ్బ కొట్టినప్పటికీ&comma; రాజ్యాంగపరమైన చిక్కులు ఆయనను వేధిస్తున్నాయి&period; ప్రస్తుతం విజయ్ ఇతర చిన్న పార్టీలు&comma; స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు&period; ఇదే సమయంలో డీఎంకే&comma; ఏఐఏడీఎంకేలు కూడా ఈ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకుని మళ్లీ చక్రం తిప్పాలని చూస్తున్నాయి&period; తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు ఆ 6 మంది ఎమ్మెల్యేల మద్దతు పైనే ఆధారపడి ఉంది&period; 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను విజయ్ ఎప్పుడు సమర్పిస్తారో&comma; అప్పుడే దళపతి సీఎం పీఠంపై సందిగ్ధత తొలగిపోతుంది&period; రాబోయే 48 గంటలు తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకంగా చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా ఉంది&period; ఒకవేళ చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినా&comma; అది నూలుపోగు మీద నడిచే ప్రభుత్వంలా మారుతుంది&period; ఏ ఒక్క ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నా లేదా విపక్షాల ప్రలోభాలకు లోనైనా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది&period; ఇటువంటి బలహీనమైన ప్రభుత్వంతో విజయ్ తన భారీ సంక్షేమ హామీలను అమలు చేయడం అసాధ్యం అనే చర్చ నడుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలబడాలంటే అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమ మార్గమని చర్చ జరుగుతోంది&period; 47 స్థానాలు కలిగిన అన్నాడీఎంకే గనుక ప్రభుత్వంలో భాగస్వామి అయితే&comma; టీవీకే కూటమి బలం 160కి చేరుకుంటుంది&period; అయితే&comma; దీనికి అన్నాడీఎంకే తన మిత్రపక్షమైన బీజేపీని వదులుకోవాల్సి ఉంటుంది&period; అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నందున పళనిస్వామితో విజయ్ జరిపే చర్చలే కీలకం కానున్నాయి&period;<&sol;p>&NewLine;<p>రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఏ పార్టీ అయినా బలమైన మిత్రపక్షాల కోసం చూస్తుంది&period; కానీ విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశారు&period; అయితే సీనియర్ నేతలు దీన్ని అనుభవలేమి అని విమర్శించారు&period; ఇక మ్యాజిక్ ఫిగర్ రాకముందే ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేసుకోవడం&comma; ఆ తర్వాత అది రద్దు కావడమే ఆయనకు రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించిన విషయంగా చెప్తున్నారు&period; సాధారణంగా అనుభవం ఉన్న నేతలు తెర వెనుక మద్దతు కూడగట్టుకున్నాకనే అధికారిక ప్రకటనలు చేస్తారు&period; విజయ్ విషయంలో ఆ హడావిడి కొంత పబ్లిసిటీ స్టంట్ లాగా మారిందనే విమర్శలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p>స్టాలిన్&comma; పళనిస్వామి వంటి నేతలు దశాబ్దాలుగా గ్రౌండ్ లెవల్ రాజకీయాల్లో ఉన్నారు&period; విజయ్‌కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకొచ్చినా&comma; మిగిలిన 5 సీట్ల కోసం ఆయన ఇతర పార్టీల బేరసారాలను ఎదుర్కోవాల్సి వస్తోంది&period; ఇక్కడ ఆయనకు రాజకీయ చతురత ఎంత ఉందనేది ఇప్పుడు అసలైన పరీక్ష&period; అయితే విజయ్‌కు రాజకీయ చతురత ఉందో లేదో ఇప్పుడే ఒక అంచనాకు రాలేం&period; అయితే&comma; కేవలం సినిమాల ద్వారా వచ్చే ఇమేజ్ వేరు&comma; అసెంబ్లీలో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడం వేరు&period; అక్కడ ఆయన నెగ్గాలంటే కచ్చితంగా తన రాజకీయ చతురతను నిరూపించుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే&comma; మద్దతు ఇచ్చే పార్టీల ఒత్తిడిని తట్టుకోవడం ఆయనకు అతిపెద్ద సవాలుగా మారుతుంది&period; విజయ్ పార్టీకి సొంతంగా మెజార్టీ లేదు కాబట్టి&comma; మద్దతు ఇచ్చే పార్టీలు ఖచ్చితంగా కీలకమైన మంత్రి పదవులను అంటే హోమ్&comma; ఆర్థిక&comma; రెవెన్యూ వంటి శాఖలను ఆశిస్తాయి&period; ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 క్యాబినెట్ బెర్త్‌లను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; ఇదే సమయంలో కొత్తగా వచ్చిన పార్టీగా విజయ్ తన మార్క్ పాలన చూపించాలనుకుంటారు&period; కానీ కీలక శాఖలు ఇతరుల చేతిలో ఉంటే&comma; ఆయన అనుకున్న మార్పులను తీసుకురావడం కష్టమవుతుంది&period; మరి ఈ సవాలును విజయ్ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి&period;<&sol;p>&NewLine;<p>విజయ్ తన పార్టీ సిద్ధాంతాన్ని ద్రవిడ జాతీయవాదం&comma; లౌకికవాదం అని ప్రకటించారు&period; కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ఇస్తూనే&comma; మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలి అనే కండిషన్ పెట్టింది&period; ఒకవేళ VCK లేదా ఎడమపక్షాలు మద్దతు ఇస్తే&comma; వారు తమ సామాజిక న్యాయం&comma; కార్మిక వర్గ ఎజెండాలను ప్రభుత్వం అమలు చేయాలని ఒత్తిడి చేస్తారు&period; మరి వీటిని అన్నిటిని సమన్వయం చేయడం విజయ్‌కు కత్తిమీద సామే అని చెప్పాలి&period; ఇక మాజీ సీఎం స్టాలిన్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు&period; విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వాలని&period;&period; ఆరు నెలల పాటు తాము వేచి చూస్తామని ఆయన అన్నారు&period; ఇది విజయ్‌కు ఊరటనిచ్చే విషయమే అయినా&comma; ఆ ఆరు నెలల తర్వాత ప్రతిపక్షం నుంచి ఒత్తిడి తీవ్రమవుతుంది&period; ఆ లోపు తన బలాన్ని నిరూపించుకుని నిలదొక్కుకోకపోతే&period;&period; ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు TVK నుంచి గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలలో అత్యధికులు కొత్తవారే&period; సంకీర్ణ ప్రభుత్వంలో ఇతర పార్టీల సీనియర్ నేతలతో చర్చలు జరపడం&comma; అసెంబ్లీలో వ్యూహాలు రచించడం వంటి విషయాల్లో విజయ్‌కు అనుభవం ఉన్న నాయకుల కొరత ఉంది&period; AIADMK వంటి పార్టీలు ఒకవేళ బయటి నుంచి మద్దతు ఇస్తే&comma; ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం వారిపై ఆధారపడాల్సి వస్తుంది&period; ఇది పరిపాలనలో జాప్యానికి దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;<p>సినిమాల్లో విజయ్ అన్నీ తానై నడిపిస్తారు&period; కానీ రాజకీయం ఇవ్వడం-తీసుకోవడం పద్ధతిలో నడుస్తుంది&period; మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గితే ఆయన ఇమేజ్ దెబ్బతినవచ్చు&period; అలాగని ఒత్తిడికి లొంగకపోతే ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉంటుంది&period; విజయ్ ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు స్ట్రాంగ్ కోఆర్డినేషన్ కమిటీ అవసరం&period; మిత్రపక్షాల డిమాండ్లను నెరవేరుస్తూనే&comma; తన సొంత ఎజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆయన రాజకీయ పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది&period; ప్రస్తుతం ఉన్న హంగ్ పరిస్థితిలో&comma; విజయ్ సీఎం కుర్చీ ఎక్కినా&comma; అది ముళ్ల కిరీటమే అవుతుంది అనడంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;<p>ఒకవేళ విజయ్ మే 10 లోపు మెజార్టీ నిరూపించుకోలేకపోతే వేరే కూటమికి గవర్నర్ చాన్స్ ఇవ్వవచ్చు&period; రెండో అతిపెద్ద పార్టీ లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరవచ్చు&period; అయితే ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేకపోతే&comma; గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది&period; రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే ఆరు నెలల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p>రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం&comma; విజయ్ కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు చేశారు&period; స్పష్టమైన మెజార్టీ రాకముందే ప్రమాణ స్వీకారం కోసం తేదీని నిర్ణయించుకోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది&period; ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లేదా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉంటే&comma; ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు&period; కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను కోరి ఉండాల్సింది&period; కానీ ఆయన ముందే మెజార్టీ ఉంది అని చెప్పడం వల్ల ఇప్పుడు గవర్నర్ ఆ సంఖ్యను నిరూపించుకోమని ఒత్తిడి తెస్తున్నారు&period; అయితే గవర్నర్ అవకాశం ఇవ్వకపోతే విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది&period; గతంలో ఎస్&period;ఆర్&period; బొమ్మై కేసు తీర్పు ప్రకారం&comma; మెజార్టీ అనేది రాజ్‌భవన్‌లో కాదు&comma; అసెంబ్లీ ఫ్లోర్ మీద నిరూపించుకోవాలి&period; ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని విజయ్ వాదించవచ్చు&period; కోర్టు జోక్యం చేసుకుంటే&comma; అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ను ఆదేశించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి&period; ఇందులో మొదటిది చిన్న పార్టీలతో పొత్తు కాంగ్రెస్ 5&comma; VCK 2&comma; CPI&sol;CPM 4&period;&period; వీరంతా మద్దతు ఇస్తే 119 సీట్లతో గట్టెక్కవచ్చు&period; అయితే ఈ చిన్న పార్టీలు సిద్ధాంతపరంగా బలమైనవి&period; ప్రతి విషయంలోనూ వారు విజయ్‌ను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది&period; ఇది పాలనలో అస్థిరతకు దారితీయవచ్చు&period; ఇక రెండో ఆప్షన్ విషయానికొస్తే&period;&period; ఆన్నాడీఎంకే మద్దతు&period; అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తన ప్రత్యామ్నాయ రాజకీయాలు దెబ్బతింటాయని విజయ్ భావిస్తున్నారు&period; అన్నాడీఎంకే అధికారం పంచుకోవాలని కోరుతోంది&comma; కానీ విజయ్ ఒంటరి సారథ్యం కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక మూడో ఆప్షన్ విషయానికొస్తే&period;&period; డీఎంకే&comma; అన్నాడీఎంకే ఏకమవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది&period; రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజం&period; విజయ్‌ను అడ్డుకోవడానికి డీఎంకే &comma; అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉందా అంటే&comma; అది అసాధ్యం కాదు కానీ చాలా కష్టం&period; ఒకవేళ ఈ రెండు ద్రవిడ దిగ్గజాలు కలిస్తే అది తమిళ రాజకీయ చరిత్రలోనే పెద్ద సంచలనం అవుతుంది&period; కానీ&comma; ఇది వారి సొంత కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతుంది&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో ప్రస్తుతం సిద్ధాంతాల కంటే అధికారం&comma; ఉనికికే ప్రాధాన్యత కనిపిస్తోంది&period; విజయ్ తన సిద్ధాంతాల కోసం రాజీ పడకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు&period; మద్దతు ఇచ్చే పార్టీలు తమ ఉనికి కోసం విజయ్‌ను వాడుకోవాలని చూస్తాయి&period; మొత్తానికి విజయ్ ఇప్పుడు ఒక గొప్ప నటుడిలా కాకుండా&comma; ఒక ఆరితేరిన రాజకీయ చతురుడిలా వ్యవహరించాలి&period; న్యాయ సలహాలు తీసుకోవాలి&period; ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి కాబట్టి&period;&period; తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ&comma; తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలి&period; ఇదే విజయ్ ముందున్న ఏకైక మార్గం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది&period; ఇదే సమయంలో విజయ్ నివాసం వద్ద ఒక ఆసక్తికరమైన&comma; భావోద్వేగపూరిత దృశ్యం కనిపించింది&period; విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక అభిమాని కన్నీరు పెట్టుకున్నారు&period; ప్రజలు మార్పును కోరుకుని విజయ్‌కు మద్దతు ఇచ్చారని&comma; కానీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>గవర్నర్ తన తీరు మార్చుకోకపోతే తమిళనాడు మరోసారి ఉగ్రరూపం దాల్చుతుందని విజయ్ అభిమాన సంఘాలు హెచ్చరించాయి&period; గతంలో జరిగిన జల్లికట్టు ఉద్యమం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్లపైకి వస్తుందని&comma; అప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని వారు స్పష్టం చేశారు&period; అటు సోషల్ మీడియాలో కూడా విజయ్‌కు మద్దతుగా వందలాది పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి&period; ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్‌కు ఇంకా క్లియరెన్స్ రాలేదు&period; సొంతంగా మెజారిటీ లేని పక్షంలో&comma; మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 118 మంది సభ్యుల జాబితాను సమర్పించాలని గవర్నర్ పట్టుబడుతున్నట్లు సమాచారం&period; బలం నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో టీవీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటానికి సిద్ధమైంది&period; ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది&period; గవర్నర్ కేంద్రం చేతిలో పావుగా మారారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు&period; మొత్తానికి&comma; తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్నాయి&period; గవర్నర్ నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..