135
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి నేడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహించనున్న విజయ్ సంకల్ప్ యాత్రను అస్సాం సీఎం ప్రారంభించనున్నారు. ఆతర్వాత భైంసాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో సుమారు 8వేల మంది బీజేపీ కార్యకర్తల తో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భైంసా నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 315 కిలో మీటర్ల వరకు బస్సు యాత్ర సాగనుంది. విజయ్ సంకల్ప్ బస్సు యాత్ర లో అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అద్యక్షుడు లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ పవార్ పాల్గొంటారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.