Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారి సేవలో తెలంగాణ మంత్రి ..

శ్రీవారి సేవలో తెలంగాణ మంత్రి ..

by Rama
Ponguleti Srinivas

పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas):

తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన కావాలని-రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంగట్టారని అన్నారు. 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు, ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.
    రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు…
  • పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.
    పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని…
  • అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.
    ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

036128
Total views : 180928

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.