122
పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజక వర్గం పెనుగంచిప్రోలులో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి జగ్గయ్యపేట తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డౌన్ సెంటర్ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏసీపీ రవి కిరణ్, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
ఇది చదవండి: రాబోయే ఎన్నికల్లో విజయం మాదే…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి