110
తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా శ్రీమతి శైలజా రామయ్యర్ ను నియమించారు. ఇక జనగామ జిల్లా నూతన కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్ ను, సిద్ధిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా శ్రీ మిక్కిలినేని మను చౌదరిని ప్రభుత్వం నియమించింది.