అంగన్వాడీ(Anganwadi) కేంద్రాల్లో పనిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విషయంలో తెలంగాణ సర్కార్(Telangana government) సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పంపించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఇక రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ సిబ్బందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఒకవేళ ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక గానీ, వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని వెల్లడించింది. కాగా, పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు లక్ష, అలాగే మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది.
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు…
- భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.