కాకినాడ నుంచి అయోధ్యకు పాదయాత్ర..

charla srinivas sastri

Advertisements

&NewLine;<p>అయోధ్య రాముడికి కానుకగా తయారుచేసిన పాదుకలను స్వయంగా అందించేందుకు కాలినడకన బయలుదేరాడో భక్తుడు&period;&period; ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు పాదయాత్ర మొదలుపెట్టాడు&period; హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ చార్ల శ్రీనివాస శాస్త్రి ఈ పాదయాత్ర చేపట్టారు&period; రాముడి కోసం ఒక్కోటీ 8 కిలోల చొప్పున వెండి పాదుకలను తయారు చేయించిన శాస్త్రి&period;&period; వాటిని తలపైన ధరించి గతేడాది అక్టోబర్ 28 న నడక ప్రారంభించారు&period; ఈ వెండి పాదుకలకు బంగారం అద్దాలనే తలంపుతో తన యాత్రకు మధ్యలో విరామం తీసుకున్నారు&period; పాదుకలను హైదరాబాద్ కు పంపించి వాటికి బంగారు పూత ఏర్పాటు చేయిస్తున్నట్లు శాస్త్రి తెలిపారు&period; బంగారు పూత తర్వాత ఒక్కో పాదుక బరువు 12&period;5 కిలోలకు చేరుతుందని&comma; వాటి విలువ రూ&period;1&period;2 కోట్లు ఉంటుందని వివరించారు&period; రాముడి పాదుకలు తిరిగి వచ్చాక మళ్లీ నడక మొదలుపెడతానని&comma; వచ్చే వారంలో అయోధ్యకు చేరుకుంటానని శాస్త్రి చెప్పారు&period; ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుని రాముడి పాదుకలను ఆయన చేతిలో పెడతానని పేర్కొన్నారు&period; ఈ పాదుకలను అయోధ్యలోని రామ మందిరంలో భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉంచుతామని సీఎం యోగి హామీ ఇచ్చారని తెలిపారు&period; కాగా&comma; శ్రీనివాస శాస్త్రి గతంలోనూ అయోధ్య రాముడికి కానుకలు అందజేశారు&period; రామ మందిరం నిర్మాణానికి ఒక్కోటీ 2&period;5 కిలోల బరువున్న 5 వెండి ఇటుకలను అయోధ్యకు పంపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్