106
కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో “నిజం గెలవాలి యాత్ర” లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి రూ 3 లక్షలు నగదు చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. నారా భువనేశ్వరి ని చూసేందుకు భారీగా మహిళలు, పురుషులు తరలి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు నారా భువనేశ్వరి కాన్వయ్ ని అడ్డుకొని తమ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని, జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు. వచ్చేది మా ప్రభుత్వంమే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.