గిద్దలూరు మండలం దిగువ మెట్ట అటవీ ప్రాంతంలోని బెల్లం పాక ఏరియాలో కణితిని వేటాడి చంపిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ హెచ్. జీవన్ కుమార్ తెలిపారు. దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో కణితిని వేటాడి మాంసం తీసుకుని వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం వేకువ జామున హౌస్ బ్రిడ్జి సమీపంలో కాపు కాశారు. ఆ సమయంలో మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు మాంసం తీసుకుని వస్తుండగా వారిని పట్టుకుని విచారించారు. వారు ఇద్దరే కాకుండా మరో ముగ్గురు వేటాడినట్లు నిందితులు తెలిపారు. నిందితులు తెలిపిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చేపట్టగా అక్కడ ఉన్న ఒక నాటు తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో దిగువ మెట్టకు చెందిన మీనగా యశ్వంత్, గండు లక్ష్మి లను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడిలో దిగువ మెట్ట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి. వంశీకృష్ణ, ఎఫ్ బి ఓ లుడి.చేజర్లయ్య, ఉమాదేవి లు పాల్గొన్నారు.
కణితిని వేటాడిన ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్…
65
previous post