అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన (రూ.5 కోట్లు) సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు. శనివారం నిర్వహించిన ఈ శుభ కార్యాన్ని వైసీపీ జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారుల కు అందించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఏ మాత్రం స్వార్ధం లేకుండా సొంత నిధులతో 232 మందికి 1.25 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వడం చాల గొప్ప విషయం అన్నారు. ఫయాజ్ భాష సల్లంగుండేలా ప్రతి రోజు ప్రార్ధనలు నిర్వహించాలని హజరైన ముస్లిం సోదర సోదరీ మణులను కోరారు. అనంతరం ఫయాజ్ భాష మాట్లాడుతూ తానేదో ఆశించి ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని వివరించాడు. ఫయాజ్ బాషా ట్రస్టు ద్వారా తాను చేస్తున్న” సేవాకార్యక్రమాలు స్థానిక ప్రజలకు తెలియంది కాదన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నానన్నారు. అవకాశం కల్పించిన అల్లాకు రుణపడి ఉంటానని తెలిపారు. వైసీపీ పార్టీతోనే మైనార్టీల అభివృద్ధి సాధ్య పడుతుందని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఫయాజ్ భాష అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం మేతరుడు పల్లె రఘునాథరెడ్డికి వక్ఫ్ బోర్డు మినిస్టర్ గా పదవి ఇచ్చి ముస్లిం మైనార్టీలను అగౌరపరచాడన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యలు ఆయనకు వద్ద చెప్పుకోలేక మత పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబే ఆ పదవి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. ఆయన అపాయింటమెంట్ దొరకక మరో రకంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారని ఆవేదన చెందారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీ నాయకుడు అంజాద్ ఖాన్ ను ఉప ముఖ్యమంత్రిగా చేసి మైనార్టీల అభివృద్ధికి పాటు పడ్డాడన్నారు. దేశంలోనే పార్టీలకు, మతాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మైనార్టీలంతా ఏ పార్టీలో తమకు మంచి జరిగిందో ఆలోచించుకోవాలన్నారు. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన వైసీపీ కా, అగౌరపరచిన టీడీపీ పార్టీకా అన్నది గుర్తుంచుకోవాలంటూ సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలతా రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతపురం పార్లమెంటరీ అభ్యర్థి శంకరనారాయణ, తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల పట్టాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.