కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలతో వెట్టిచాకిరి…

Vettichakiri with the students of Kasturiba School

Advertisements

&NewLine;<p>కొయ్యురు కస్తూరిబా పాఠశాలలో విద్యార్థునిలతో పాఠశాల యాజమాన్యం వెట్టిచాకిరి పనులు చేయిస్తున్నారు&period; విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ అచ్యుత్ కస్తూరిబా పాఠశాలను సందర్శించి స్కూల్ ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థునిలతో వెట్టిచాకిరి అని వచ్చిన వార్త వాస్తవమేనని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలిపారు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ మెంబర్ గొండు సీతారాం ఆదేశాల మేరకు కొయ్యూరు కేజీబీవీ పాఠశాలను సందర్శించినట్లు అచ్యుత్ తెలిపారు&period; అయితే ఈ విషయమై ప్రిన్సిపాల్ పరిమళ ను అడుగగా ఆ ఫోటో ఇప్పటిది కాదని బహుశా ఆమె ప్రిన్సిపాల్ గా రాక ముందు తీసిన ఫోటో అయి ఉండొచ్చని ఆమె తెలిపారు&period; కానీ విద్యార్థినిలను అడుగగా రెండు వారాలు అవుతుందని వారు తెలిపారు&period; ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం కిచెన్ నుండి డైనింగ్ హాల్ వరకు అన్నం ఉన్న దబరాలను వర్కర్లు విద్యార్థినిలతో మోయించినట్లు తెలిపారు&period; దబరాను మోసుకొని వెళ్ళిన విద్యార్థినిలు 6వ తరగతి విద్యార్థిని ఒకరు కాగా&comma; మరొక ఇద్దరు 7వ తరగతి చదువుతున్నట్లు ఆ విద్యార్థినులు తెలిపారు&period; ఆ పాఠశాలలో ఇటువంటి పనులు అప్పుడప్పుడు చేయడం వాస్తవమే అని విద్యార్థునిలు ద్వారా తెలిసినట్లు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలిపారు&period; అచ్యుత్ తో పాటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాజు&comma; మహిళా పోలీస్ నారాయణమ్మ పాల్గొని విషయం తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..