తంబళ్లపల్లి భాజపా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా మన తంబాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పోతుల సాయినాథ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఐన జయచంద్రరెడ్డి విజయం సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఐదు ఏళ్ళ లో తంబల్లపల్లి ప్రజలు చాలా కష్ట పడ్డారు త్వరలో ప్రజల కు ఈ రక్షస పాలన నుండి విముక్తి లభిస్తుందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అయిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంట అందజేస్తూ వాటిని గురించి వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమండల ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, అరవింద్, రాజేష్, బాబు, లోకేష్ టిడిపి మరియు జనసేన నాయకులు పాల్గొని విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేశారు..
విజయ సంకల్ప యాత్ర విజయవంతం…
81
previous post