104
శారదాపీఠం (Saradapeetam):
రధసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో సూర్యారాధన నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సూర్య భగవానుడిని ఆరాధిస్తూ విశేష పూజలు చేపట్టారు. భక్తులకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్ధిస్తూ పండితులు త్రిచ సహిత అరుణ పారాయణ, ఆదిత్య హృదయం పారాయణ నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారములను ప్రదర్శించారు. మరోపక్క విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు రెండో రోజు కూడా కొనసాగాయి. రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు. లోక కళ్యాణార్ధం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగాన్ని పర్యవేక్షించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.