77
కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ తో కలసి ప్రచారం నిర్వచించారు. నవరత్నాల పేరుతో ప్రతి సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా పథకాలను పంపిణీ చేశామని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరో మారు జగన్ కు ఆశీర్వదించాలని కోరారు.