115
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.