77
విశాఖ, స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడికి కార్మిక సంఘాలు ఐక్యతా కార్యాచరణ పేరిట పిలుపునిచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న వేలాది కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గేటు వద్ద పెద్ద ఎత్తున జిందాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి సిద్ధంగా కార్మికులు ఉన్నారని నాయకులు తెలిపారు. జిందాల్ తో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే కార్మిక సంఘాలకు బహిర్గతం చేయకుంటే అడ్మినిస్ట్రేషన్ ను ముట్టడిస్తామంటూ కార్మిక సంఘాలు హెచ్చరించాయి.