కత్తిపోట్లతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఓటు పోటుతో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాకలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రైతు బంధు వద్దు, ధరణి వద్దు అనే పార్టీలు కావాలా? అని ప్రశ్నించారు. రైతుబంధు పెంచుతామంటున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రతిపక్షాలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగడం సిగ్గుచేటని మండిపడ్డారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. దుబ్బాకలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉన్నదన్నారు. దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యత మాది, ఓట్లు వేయండి పనులు చేసుకోండని కేటీఆర్ కోరారు.
ఓట్లు వేయండి పనులు చేసుకోండి…
76
previous post