శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారన్నారు. కొత్తూరు మండలం బూత్ నెంబర్ 202 లో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని పేర్కొన్నారు. 202 బూత్ లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదన్నారు. గతంలో జిల్లాకు స్పెషల్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా వచ్చిన శ్యామలరావు ను కలసి ఫిర్యాదు చేశానన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ తో సహా కింది స్థాయి అధికారులు దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పాత ఓటర్లను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిర మండలం ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ కు, అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.
ఓటర్ల జాబితా అవకతవకలపై వెంకటరమణ ఆరోపణ…
81
previous post