శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారన్నారు. కొత్తూరు మండలం బూత్ నెంబర్ 202 లో ఓటర్ల జాబితాలో ఒడిశాకు చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని పేర్కొన్నారు. 202 బూత్ లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదన్నారు. గతంలో జిల్లాకు స్పెషల్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా వచ్చిన శ్యామలరావు ను కలసి ఫిర్యాదు చేశానన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ తో సహా కింది స్థాయి అధికారులు దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పాత ఓటర్లను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిర మండలం ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ కు, అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.
List of Voters
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈసీ వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేలమందికి పైగా ఉన్నారు. 2కోట్ల3 లక్షల85 వేల 851 పురుష ఓటర్ల సంఖ్య ఒక కోటీ తొంభై ఎనిమిది లక్షల ముప్పయి ఒక్క వేలకు పైగా ఉన్నారు. సర్వీసు ఓటర్లు 68 వేల 158 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.





Total views : 77949