మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని ఆయన అన్నారు. మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగిందని తెలిపారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చిన్నారిపై 10 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
మహిళల కోసం మ్యానిఫెస్టోలో లేని పథకాలు తెచ్చాం..
83