టిటిడి ప్రొసీడింగ్స్ పై జగన్ బొమ్మ దేనికి…?

ttd proceedings

Advertisements

&NewLine;<p>తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టిటిడి ఎంబ్లం తో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ&comma; మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు&period; టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు&period; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార ఖండూతికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు&period; ఇప్పటివరకు సైన్ బోర్డులు&comma; వైఎస్ఆర్ కిట్లు&comma; జగనన్న విద్యా దీవెన&comma; జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామి తో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు&period; తక్షణం ప్రొసీడింగ్స్ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు&period; కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్