కడప (Kadapa) జిల్లా రాజకీయాలు అంటే సర్వత్ర ఆసక్తి. జిల్లాలో జరిగే ప్రతి ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోకస్ ఉంటుంది. కడప జిల్లా అంటే రాజకీయంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట అని అందరూ భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వారి హవా కొనసాగింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం.. ఆ ఎన్నికల్లో సానుభూతి పొందిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె… జగన్ సోదరి వైయస్ షర్మిల కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగింది. వివేకానంద రెడ్డి హత్య ను ప్రధానంగా ప్రస్తావిస్తూ హంతకులను పార్లమెంటుకు పంపవద్దని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒకప్పటి జగన్ వదిలిన బాణం బల్లెంగా మారి వైసీపీకి ఓటమి తప్పదేమో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి కడప కోటలో గెలిచే దేవరనేది ఆసక్తిగా మారింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కడప పేరు దేశంలోనే ప్రసిద్ధి ఖనిజాలకు.. కవులకు.. కళలకు కడప పుట్టినిల్లు. అయితే పాలిటిక్స్ లో కడప ఖ్యాతి ఢిల్లీ దాకా పాకింది. అలాంటి గడ్డమీద ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కాక రేపుతున్నాయి. కడప పార్లమెంటు నుంచి టిడిపి అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. వైయస్ కుటుంబం నుంచి దివంగత సీఎం వైఎస్ఆర్ ముద్దుల తనయ.. సీఎం జగన్ చెల్లెలు.. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మళ్ళీ బరిలో దిగుతున్నారు. వివేక హత్యతో వైస్ కుటుంబం రెండుగా చీలింది. వివేకానంద రెడ్డి ని చంపిన హంతకులను చట్టసభలకు మళ్ళీ పంపకూడదని ఉద్దేశంతోనే కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతున్నారు. బస్సు యాత్రలో అదే విషయం నొక్కి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కడవ పార్లమెంటు ఎన్నికలు సర్వత్ర ఆసక్తికరంగా మారాయి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కడప పార్లమెంటు 1952లో ఏర్పడింది. ఆ సంవత్సరమే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికలలో సిపిఐ కి చెందిన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి చెందిన బసిరెడ్డి పై సుమారు 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రజా సంక్షేమం.. పార్టీ కోసం ఆస్తులు త్యాగం చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ఐదు సార్లు కడప ఎంపీగా పోటీ చేసే నాలుగు సార్లు గెలుపొందారు. 1952, 1962, 1967,1971లో గెలుపొందారు. 1957 లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వి.ఆర్. రెడ్డి చేతిలో ఓటమి చెందారు. కడప పార్లమెంటుపై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. 1952 నుంచి 18 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. వీరిలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. కడప పార్లమెంటు ఏర్పడిన తర్వాత టిడిపి ఒక్కసారి గెలుపొందింది. 1984లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బి.ఎన్.రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబుల్ రెడ్డి పై విజయం సాధించారు.
కడప పార్లమెంటుపై దివంగత వైఎస్ఆర్ కుటుంబం తన ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కడప ఎంపీగా 1989లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచి ఆ కుటుంబానికి చెందిన వారే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1989, 1991, 1996,1998 ఎన్నికల్లో దివంగత వైఎస్ఆర్ ఎంపీగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందగా… ఉప ఎన్నికల్లో 2011లో సొంత పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014..2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న కొడుకు ఎంపీ అవినాష్ రెడ్డి గెలుపొందగా ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు.
కడప పార్లమెంటుపై వైస్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. 1989 నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైయస్ కుటుంబ సభ్యులు గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి గెలుపు ఆనవాయితీ మారేటట్లు ఉందంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పిసిసి వైఎస్ షర్మిలారెడ్డి బరిలోకి దిగుతుండగా.. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్క.. తమ్ముడు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక టిడిపి నుంచి చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. మొదటిసారి పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు రసవతంగా మారాయి ఈ ముక్కోనపు పోరులో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో… ఎవరిని గెలిపించి పార్లమెంటుకు పంపుతారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. వైయస్ కుటుంబానికి తొలిసారి ఓటమి తప్పదా…! ముక్కోనపు పోటీలో టిడిపి లబ్ది పొందుతుందా..! కడప కోటలో గెలుపు ఎవరిని వరిస్తుందో.. అనే ఉత్కంఠ కు తెరపడాలంటే… వేచి ఉండాలి మరి..
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి