కాణిపాక వరసిద్ధి వినాయకుడు బావిలోనే ఎందుకు వెలిశాడు?

Kanipaka Varasiddhi is Ganesha

Advertisements

&NewLine;<p>కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది&period; దాని ఒడ్డున ఓ బావి ఉండేది&period; దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం&period; అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం&period; ఆ ఊరిపేరు విహారపురి&period;కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది&period; దాని ఒడ్డున ఓ బావి ఉండేది&period; దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం&period; అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం&period; ఆ ఊరిపేరు విహారపురి&period; ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు&period; వారు పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారు&period; ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు&period; స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు&period;ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి&period; దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు&period; తవ్వుతున్నప్పుడు ఠంగ్‌మనే శబ్దం వినిపించింది&period; పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి&period; దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది&period; రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట&period; ఆ నోటా ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు&period; అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది&period; భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు&period; వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది&period; అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది&period; కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది&period; కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు&period; ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు&period; దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే&period; ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు&period; ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది&period; వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత&period; ఎలాంటి వివాదాలు వచ్చినా&period;&period; నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం&period; బ్రిటిష్‌ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది&period; ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి&period; అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు&period; బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..