వైసీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా?

Will YCP face a strong backlash?

Advertisements

&NewLine;<p>ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి&period; తణుకు నుంచే అనేకమంది ఉద్దండలు&comma; శాస్త్రవేత్తలు&comma; పారిశ్రామిక వేత్తలు దేశవ్యాప్తంగా పేరుగాంచారు&period; తణుకు లో 1947లో ఆంధ్రా షుగర్స్‌- స్వతంత్ర భారతదేశంలో స్థాపించబడిన మొదటి పరిశ్రమ&comma; భారతదేశంలో మొట్టమొదటి ఆస్పిరిన్ ఫ్యాక్టరీ మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సరఫరా చేసే రాకెట్ ఇంధన యూనిట్‌ ఇక్కడ ఉండటం తణుకు ప్రత్యేకత&period;&period; ఇంత ప్రఖ్యాతగాంచిన తణుకు నియోజకవర్గంలో రాజకీయాలు అదే స్థాయిలో ఉంటాయి&period; ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో ఎన్నికలు వార్ కొనసాగుతుంది&period; నియోజకవర్గంలో గెలిచేది నువ్వా నేనా అంటూ అటు వైసిపి ఇటు టిడిపి&comma; గెలుపు గుర్రాల కోసం పరుగులు పెడుతున్నాయి&period; తణుకు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఆరుసార్లు  విజయాన్ని సాధిస్తే కాంగ్రెస్ రెండు సార్లు&comma; వైసిపి ఒక్కొసారి అదికూడా స్పల్పమెజార్టీతో గెలిచింది&period;<br>ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న కారుమూరి నాగేశ్వరరావు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు&period; ఆ తర్వాత వైస్సార్సీపీ లో చేరి 2014లో టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు&period; ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు&period; తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ బరిలో ఉన్నారు&period; ఇప్పటికే కారుమూరి నాగేశ్వరావును వైసీపీ బాస్ జగన్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు&period; అయితే జనసేన&comma; టిడిపి కూటమి నేపథ్యంలో ఇప్పటివరకు తణుకు నియోజకవర్గ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న ది ఇంకా స్పష్టత రాలేదు&period; ఒక పక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధా కృష్ణ టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతుంటే మరో పక్క జనసేన నేత విడివాడ రామచంద్రరావు జనసేన&comma; టీడీపీ కూటమిలో టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు&period; ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు&period; ఇటు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కూడా వైసిపి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు &period;&period;ప్రభుత్వ పాలనపై నిత్యం తణుకు ప్రాంతం నుంచి టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట ఆద్వర్యంలో ఆందోళణలు&comma; నిరసనలు వెల్లువెత్తుతున్నాయి&period; దీని ద్వారా సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్ధమయ్యేలా చెప్పడంతో పాటు&comma; ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అరిమిల్లిది అందవేసిన చేయిగా మారింది&period; తణుకులో టిడిపి క్యాడర్ కు ఉన్న కాన్ఫిడెంస్ చూసిని అధినేత చంద్రబాబు అక్కడి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు&period; పంటనష్టమయిన రైతులకు పరిహారం ఇవ్వండంటూ చంద్రబాబు సైతం తణుకులో పాదయాత్ర చేపట్టారు&period; రైతులు నష్టపోయి బాధలో ఉంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యే&comma; మంత్రి కారుమూరి మాత్రం రైతులను ఎర్రిపప్పలంటూ సంబోదించడం అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది&period; ఈఘటనతో  టిడిపి ప్రజాబలం మరింత పెరిగింది&period;&period; <br>రాష్ట్రవ్యాప్తంగా వైసిపి చేస్తున్న అరాచకాలపై తెలుగుదేశంపార్టీ గొంతెత్తడం ఒక ఎత్తయితే మంత్రికారుమూరి నియోజవర్గమైన తణుకులో తెలుగు తమ్ముళ్ళు ఎన్నో కేసులు&comma; ఒత్తిళ్ళు ఎదుర్కొని గళమెత్తడం మరోఎత్తు అయితే ప్రస్తుతం టీడీపీ&comma; జనసేన కూటమి నేపథ్యంలో తణుకు నియోజకవర్గ టికెట్ టిడిపి తరఫునమాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణకు ఇస్తారా లేక జనసేన నేత విడివాడ రామచంద్రరావు&period;&period; కు ఇస్తారో అన్న సందిగ్ధత ఇక్కడ పార్టీ శ్రేణుల్లో నెలకొంది&period;&period; 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన ఆరమిల్లి రాధాకృష్ణ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు&period; అయితే ఈసారి ఎన్నికల్లో టిడిపి తరఫున రాధాకృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు తధ్యమని నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు&period;&period;అసలు తణుకు నియోజకవర్గంలో ఏపార్టీ జెండా ఎగురుతుందో తెలియయ్యాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..