మంచిర్యాల జిల్లాలో గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్ . తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని అనిత విక్రయిస్తోందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. మందమర్రిలోని విద్యానగర్ కు చెందిన మక్కల గంగాధర్ అనే యువకుడికి కొంత డబ్బు ఇచ్చి గంజాయి తీసుకురమ్మని ఆదేశించిందని తెలిపారు. దీంతో గంగాధర్ చంద్రపూర్ కు వెళ్లి రెండు కిలోల గంజాయిని తీసుకువచ్చి అనితకు ఇచ్చాడు. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ మూడు వందల రూపాయల చొప్పన అనిత విక్రయించేంది. పక్కా సమాచారంతో పోలీసులు గుర్రాల అనిత నివాసం పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా ఒక కిలో వంద గ్రాముల గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనపర్చుకుని అనితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఏసీపీ తెలిపారు. గంజాయిని అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రవికుమార్ హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి