90
బాపట్ల జిల్లా వేమూరి నియోజకవర్గ కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం ఉదయం వాగోలు చిన్నమ్మాయి వయసు 57 మొక్కజొన్న పొలంలో నీళ్లు పెట్టటానికి వెళ్లి, సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు పొలం వద్ద చూడగా ఆమె కరెంటు మోటార్ వద్ద మృతి చెందినట్టు గుర్తించారు. కరెంట్ షాక్ వల్ల ఒంటిమీద కాలిన గాయములు కాగా మెడకు ఆమె చీర కొంగు చుట్టి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాగోలు చిన్నమ్మాయి భర్తతో విడిపోయి సుమారు 25 సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం సాగిస్తుంది.
ఇది చదవండి: ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి