వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడం లేదు. తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వెళ్లినవారి రద్దీ ఇంకా ఎక్కువగా ఉండనుంది. రాష్ట్రంలో పాఠశాలలు 18 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిన వారిలో అత్యధికులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాచలం, కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో దాదాపు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, నెల్లూరుల నుంచి వచ్చే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. నేడు, రేపు భారీగా ప్రయాణాలు ఉండనున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులు, రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే సర్వీసుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. ఇంకా కొన్ని ప్రత్యేక సర్వీసులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
తిరుగు ప్రయాణంలోనూ తప్పని తిప్పలు…
65
previous post