తంటికొండ లో వైసీపీ కార్యకర్తలతో తోట నరసింహం తనయుడు తోట రాంజీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో
తన తండ్రి నరసింహం కు సపోర్ట్ గా నియోజకవర్గంలో పలు చోట్ల కార్యకర్తలు తో తోట రాంజీ మమేకం అవుతున్నారు. తన తండ్రి తోట నరసింహం ఎమ్మెల్యే గా, మళ్ళీ వైసీపీ గెలవాలని తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గంపేట లో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు కార్యకర్తలు మరింత కృషి చేసి, తన తండ్రి తోట నరసింహం గెలుపుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు రాంజీ దిశానిర్దేశం చేశారు. మరోపక్క తోట నరసింహం ను ఎమ్మెల్యే చేసేందుకు ఆయన సతీమణి తోట వాణి, కోడలు, కూతురు ప్రసూన్న ముగ్గురు కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం కార్యకర్తల తో ఆత్మీయ సమావేశాలకు సిద్ధంగా ఉన్నామని రాంజీ తెలిపారు. ఈ నేపద్యంలో ఈ రోజు గోకవరం మండలంలో పలు గ్రామాల్లో వైసీపీ కేడర్ తో ఆత్మీయ సమావేశంలో తోట రాంజీ పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube