పి గన్నవరం నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జి గా నియమించిన మూడు రోజుల తర్వాత విప్పర్తి వేణుగోపాలరావు పి గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సాక్షిగా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిటింగ్ ఎమ్మెల్యేని కాదని జిల్లా పరిషత్ చైర్మన్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెప్పడంపై ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పి గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిగా నియమితులై మొదటిసారి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న విప్పర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి పి.గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాల వైసీపీ ప్రెసిడెంట్ లు గైర్హాజరు కావడంపై మరోసారి వైసీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సిపి నేతలు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా వేణుగోపాలరావు కు జలక్ ఇచ్చారు. కొండేటి చిట్టిబాబుని కాదని మరి ఎవరికైనా సీట్ ఇస్తే సహకరించేది లేదని కొండేటి చిట్టిబాబు వర్గీయులు ముందే తెలియజేశారు. దీనితో పి గన్నవరం నియోజకవర్గంలో వైసిపి వర్గ పోరు ఆరంభమైందని నియోజకవర్గం అంతట గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ వైసిపి ముఖ్య నేతలు గైర్హాజరు పై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అని కొత్త ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ కవర్ చెయ్యడానికి ప్రయత్నించారు.
బయటపడ్డ వైసీపీ వర్గ విభేదాలు…
95
previous post