బయటపడ్డ వైసీపీ వర్గ విభేదాలు…

Vipparthi Venugopala Rao

Advertisements

&NewLine;<p>పి గన్నవరం నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జి గా నియమించిన మూడు రోజుల తర్వాత విప్పర్తి వేణుగోపాలరావు పి గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు&period; అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సాక్షిగా వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి&period; సిటింగ్ ఎమ్మెల్యేని కాదని జిల్లా పరిషత్ చైర్మన్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెప్పడంపై ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు&period; అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పి గన్నవరం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టారు&period; ఇన్చార్జిగా నియమితులై మొదటిసారి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న విప్పర్తికి చేదు అనుభవం ఎదురైంది&period; ఈ కార్యక్రమానికి పి&period;గన్నవరం నియోజకవర్గం నాలుగు మండలాల వైసీపీ ప్రెసిడెంట్ లు గైర్హాజరు కావడంపై మరోసారి వైసీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి&period; నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న వైఎస్ఆర్సిపి నేతలు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా వేణుగోపాలరావు కు జలక్ ఇచ్చారు&period; కొండేటి చిట్టిబాబుని కాదని మరి ఎవరికైనా సీట్ ఇస్తే సహకరించేది లేదని కొండేటి చిట్టిబాబు వర్గీయులు ముందే తెలియజేశారు&period; దీనితో పి గన్నవరం నియోజకవర్గంలో వైసిపి వర్గ పోరు ఆరంభమైందని నియోజకవర్గం అంతట గుసగుసలు వినిపిస్తున్నాయి&period; నియోజకవర్గ వైసిపి ముఖ్య నేతలు గైర్హాజరు పై స్పందిస్తూ అలాంటిదేమీ లేదు అని కొత్త ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ కవర్ చెయ్యడానికి ప్రయత్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!