వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar reddy), ఏఐఐసి చైర్మన్ జుంకె వెంకటరెడ్డి మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల కు వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ గజా మాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వద్ద నుండి ఎస్వికేపి కాలేజీ వరకు వైసిపి కార్యకర్తలు అభిమానులు సుమారు 1000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్వికెపి కాలేజి ఎదురుగా చెవిరెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి పరిపాలనను మయమరిపిస్తూ అంతకు మించి పేద ప్రజలకు బలహీన వర్గాల ప్రజలకు అట్టడుగు ప్రజలు ఆర్ధికంగా ఎదిగేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందని అన్నారు.
ఈరోజు ఒకటో తేదీ అయినా ఎలక్షన్ కోడ్ కారణంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేయకపోవడం తో అవ్వ తాతలు మహిళలు పెన్షన్ కోసం పడిగాపులు పడే పరిస్థితి నెలకొన్నదని ఈ పాటికే మీకు జగనన్న పరిపాలన అర్ధం అయ్యిందన్నారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. జగనన్న బొమ్మతోనే అభ్యర్థులందరు గెలుస్తామన్నారు.
ఇది చదవండి: అప్పిచ్చిన వ్యక్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కడకు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి