జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

vamshi krishna yadhav

Advertisements

&NewLine;<p>విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు&period; వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు&period; జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు&period; సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు&period; తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని వెల్లడించారు&period; ఉత్తరాంధ్రలో&comma; విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు&comma; పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు&period; వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు&period; వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు&period; స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి&comma; మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు&period; ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్