రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం..

Municipal Council Budget Meeting

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వ్యక్తిగత ఆరోపణలు దూషణలతో రాసాభాసగా మారింది&period; మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరమణ అధ్యక్షతన ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశంలో&period;&period; బడ్జెట్ మొత్తం అంకెల గారెడీ తప్ప కొత్త విషయాలు గాని&comma; పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు గానీ లేవని స్వతంత్ర కౌన్సిలర్&comma; మాజీ ఛైర్పర్సన్ భర్త కోటిపల్లి సురేష్ విమర్శించారు&period; దాంతో అధికార కౌన్సిలర్లు రాజు&comma; సురేష్ లు కోటిపల్లి సురేష్ పై ద్వజమెత్తారు&period; మున్సిపాలిటీ చరిత్ర లో చైర్ పర్సన్ కోటిపల్లి పద్మ ఒక్కరే బాగా లబ్ది పొందారని విమర్శిచారు&period; తన భార్య హయాంలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కౌన్సిలర్ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు&period; నరసాపురం మున్సిపల్ భవనం నిర్మాణానికి అప్పటి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రసాదరాజు కృషి చేసారని అధికార కౌన్సిలర్లు అనడంతో&period;&period; తమ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా నిధులు తెచ్చి నిర్మించామే తప్ప ప్రసాదరాజుకు సంబంధం లేదని కౌన్సిలర్ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు&period; మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిధులు తీసుకువచ్చారని వైస్ చైర్మన్ కొత్తపల్లి నానీ అనడంతో కౌన్సిల్ సమావేశం రాసాభాసగా మారి వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..