ప్రత్తిపాడులో నియెజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా mlc అనంత ఉదయ భాస్కర్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జోనల్ వింగ్ యువత అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు నాలుగు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్టంలో వైసీపీ పార్టీని 175 నియెజకవర్గాలలో గెలుపొందే దిశగా ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు లో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ ను ప్రత్తిపాడు నియెజకవర్గములో వరుపుల సుబ్బారావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రంలో ప్రజలకు మచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
ప్రత్తిపాడు లో వైసీపీ పార్టీ సిద్ధం సభ…
134
previous post