86
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఫైనాన్స్ ఒత్తిడికి యువకుడు బలి అయిన సంఘటన ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం సిపాయిపేటలో చోటుచేసుకుంది, తాడేపల్లిగూడెం సిపాయిపేట రోడ్ నెంబర్ ఫైవ్ లో మృతుడు ముత్యాల పవన్(27) 2022 సంవత్సరంలో షిఫ్ట్ డిజైర్ కారు ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు, గత రెండు నెలలుగా కిరాయిలు లేకపోవడంతో ఫైనాన్సు చెల్లించలేకపోయాడు, దీంతో పవన్ను తీవ్ర ఒత్తిడికి ఫైనాన్స్ కంపెనీ గురి చేయడంతో ఉదయం ఆరు గంటలకి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతి చెందాడు.లోపల నుంచి ఎంతటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు బద్దలు కొట్టడంతో కొడుకు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.