కడప జిల్లా.. కడప వైసిపి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైయస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy). కలెక్టర్ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కడప మేయర్ సురేష్ బాబు, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, మైనార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. కడప సమీపంలోని కొప్పర్తి ని పారిశ్రామిక హబ్ గా తయారు చెస్తూ… సుమారు 30 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో సుమారు లక్ష మంది నిరుద్యోగులకు కొప్పర్తిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్టిల్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని… మొదటి దశ పనులు 2026 కు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి