సీఎం జగన్(CM Jagan) పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ సునీతా(YS Sunita) జగన్పై సంచలన వ్యాఖ్యల చేశారు. ఎక్కువ రోజుల పాటు తలకు బ్యాండేజీ ఉంటే సెప్టిక్ అవుతుందని సెటైర్లు వేశారు. జగన్కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదేమో.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీసేయాలంటూ ఓ వైద్యురాలిగా సలహా ఇస్తున్నానంటూ చురకలంటించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బదులిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డిపై సీఎంకు ద్వేషం ఉందన్నారు. హత్యపై మాట్లాడొద్దని చెప్పి కోర్టుకు వెళ్లిన వారి అదే హత్యపై మళ్లీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే నన్ను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని సునీత ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.