76
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఒకటో సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేయాల్సిన సచివాలయ సిబ్బంది కనీసం వేడుకలు కూడా నిర్వహించలేదు. పది రోజుల కిందట సచివాలయ ఆవరణలో వైసీపీ జెండాను ఎగరవేసి అలాగే ఉంచేశారు. నేడు దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే సచివాలయ సిబ్బంది మాత్రం ఫీల్డ్ పనిమీద బయటకెళ్లే అంశాన్ని సాకుగా చూపి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు. దీంతో సచివాలయం వద్దకు వచ్చిన స్థానికులు వైసీపీ జెండా ఎగురుతుండడం చూసి సచివాలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.