ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులలో భయం మొదలైంది…ఈ సారి 2024 ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు బట్టి సీట్లు కేటాయించబోతున్నట్లు సియం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఓ సర్వే సంస్థ ఇచ్చిన సర్వేల ఆధారంగా ఈ సారి 2024 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో సగం మందికి పైగా కొత్త వారికే అవకాశం వచ్చేటట్లు ఉంది. పుంగునూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, తిరుపతి నుండి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. మిగిలిన 9 నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ ఎస్టీ, ఒక మైనార్టీ, ఒక బిసి, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన 7 చోట్లు సియం జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఒక కుప్పం మినహాయిస్తే మిగిలిన 13 చోట్ల వైసిపి ఫ్యాన్ గాలి వీసింది. కాని ఈ సారి మూడు రిజర్వడ్ నియోజకవర్గాలైన సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసే ఆలోచనలో సియం జగన్ ఉన్నట్లు సమాచారం.
సత్యవేడు ఎమ్మెల్యే అదిమూలం పై అటు ప్రజల్లో ఇటూ సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈ సారి అక్కడ అయనను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో సత్యవేడు నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తిని కాని డ్యీపుటి సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి లేకపోతే టిడిపి నుంచి సీటు రాక నిరాశతో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కుమారుడు వైసిపి సీటు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం గంగాధర నెల్లురు ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. ఆయనను అక్కడనుండి తప్పించి చిత్తూరు ఎంపీ గానో లేకపోతే తిరుపతి ఎంపి గానో పోటి చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నారాయణ స్వామికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, చిత్తూరు మాజీ ఎంపి జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులు తో వైరం తో 2024 ఎన్నికల్లో అతన్ని ఓడించి తీరుతామని బహిరంగంగా పార్టీ నాయకులే అంటుండటంతో పార్టీ అధిష్టానం ఆ సీటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కి కేటాయించాలా వద్దా అన్న సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిపై నోరు అదుపు తప్పడం పార్టీ హై కామెండ్ నోటీసులో ఉనట్లు సమాచారం. ఇక పూతలపట్టు నియోజవర్గంలో ఎమ్.ఎస్ బాబు పనితీరు అంతంత మాత్రమే, ఈయనపై ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ఈ సారి ఎమ్.ఎస్ బాబుకు టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఎవరూ పనిచేయామని తేల్చి చెప్పారు. సర్వలేలలో బాబు పనితీరు పూర్తిగా బాగోలేదని సర్వే సంస్థ ఇచ్చిన ఆధారంగా అయినను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సి.యం.జగన్ ఉన్నట్లు సమాచారం. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ఒక అడుగు ముందుకు వేసి మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసారు. సర్వే సంస్థలకు డబ్బిస్తే ఎవరి పేరైనా చెప్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా జిల్లాలో ముఖ్య నాయకులు చెప్పినట్లే చేసానని, అయినా జిల్లాలో ఎస్సీ నాయకులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. అయినా వైసిపి తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానంగా చిత్తూరు జిల్లాలో సగం పైగా నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నవారికే సీటు దక్కుతుందని పబ్లిక్ టాక్.. ఇక పీలేరు లో ప్రస్తుతం చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో చింతల పనితీరు పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ సారి ఆయనను తప్పించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంలోని ఆయన తమ్ముడు కుమారుడు సుధీర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సియం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై పోటీకి సుధీర్ రెడ్డిని నిలిపి తన రాజకీయ బద్ద శత్రువైన నల్లారి కుటుంబాన్ని ఓడించాలని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజాకు ఇంటాబయటా పోరు తప్పెట్లు లేదు అన్నట్టు సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పని చూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో రోజాకు సీటు గాని కేటాయిస్తే మేమెవరం ఆమె గెలుపుకు కృషి చెయ్యబోమని నగరి నేతలు అమ్ములు, కే.జే.కుమార్, రెడ్డి వారి చక్రపాణి రెడ్డితో పాటు మరో మండల అధ్యక్షుడు ఉన్నట్లుగా పార్టీ హై కమాండ్ గుర్తించింది. దీంతో ఆమెను ఈ సారి ఎన్నికల్లో తప్పించి, బదులుగా ఏదైనా నామినేటెడ్ పోస్టులు గాని ఎమ్మెల్సీతో గాని సరిపెట్టాలని సియం జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక నగరి నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కె.జే.కుమార్ సతీమణి శాంతిని గాని శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డికి గాని టికెట్టు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా సమాచారం. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం బియ్యపు మధుసూదన్ రెడ్డి పై సర్వే నెగిటివ్ టాక్ రావడంతో సి యం జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లు పబ్లిక్ లో టాక్ నడుస్తుంది. కాని సియం జగన్ అత్యంత ఆప్తుడులో ఒకరు బియ్యపు మధుసూదన్ రెడ్డి. అందుకే జగన్ ముందుగానే హెచ్చరించి మిగిలిన ఈ మూడు నెలలు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి గెలుపు కోసం కృషి చేసుకోవాలంటూ క్లాస్ పీకి సీటు కన్ఫర్మ్ చేయ్యబోతున్నట్లు సమాచారం. మూడు నెలలు తర్వాత అతని పనితీరు తో పాటు, సర్వే సంస్థ ఇచ్చె గ్రాఫ్ పైన సీటు ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాల నుండి వినపడుతున్న మాట. అయినా మరోపక్క శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నత సమాచారం. ఇక మదనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం శరవేగంగా మారుతుంది. కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తున్నారు .ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, అక్కడ ఓక్క అభివృద్ధి పనికూడా నోచుకోకపోవడం తో అక్కడి ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారని సంస్థ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటివరకు శాసనసభ్యుడిగా ఉన్న నవాజ్ అహమ్మద్ కు టికెట్ రాదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎమ్మెస్ దేశాయ్ తిప్పారెడ్డి, పంచాయతీరాజ్ రిటైర్డ్ డి ఈ నిస్సార్ అహ్మద్, వైసీపిలో మరో వ్యాపారవేత్త మల్లెల పవన్ కుమార్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు విషయమై అధికారిక సమాచారం లేదు. ఇక చిత్తూరు లో ఆరని శ్రీనివాస్ ను తప్పించి ఆయన స్థానంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డికి సీటు ఇచ్చే అవకాశం కనపడుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో విజయానంద రెడ్డికి లైన్ క్లియర్ అవకాశం స్పస్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విజయానంద రెడ్డి సొంత ట్రస్ట్ ద్వారా నియోజకవర్గం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తుండటం, అలాగే జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది కోట్ల రూపాయలతో 53 వేల మందికి వస్త్రాలు బహుకరించారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చిత్తూరులో తనదైన శైలిలో వైసిపి పార్టీ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయానంద రెడ్డికి సీటు కేటాయిస్తే చిత్తూరు అసెంబ్లీని వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో మరో రెండు,మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులకు గుండెల్లో దడ మొదలై మొదలైంది.
సీట్ల సర్దుబాటు లో వైఎస్ఆర్ సీపీ అధినేత….
91
previous post